దర్శకుడ్ని ఇంటర్వ్యూ చేసిన రకుల్

Friday,July 21,2017 - 07:30 by Z_CLU

సుకుమార్ ‘దర్శకుడు’ ఆగష్టు 4 న రిలీజ్ కి రెడీ అవుతుంది. రీసెంట్ గా ఆడియో రిలీజ్ జరుపుకున్న ఈ సినిమా సోషల్ మీడియాలో ఇంటరెస్టింగ్ బజ్ క్రియేట్ చేసింది. ఓ వైపు ‘రంగస్థలం’ సినిమా పనులు చూసుకుంటూనే తన సొంత బ్యానర్ లో తెరకెక్కుతున్న ‘దర్శకుడు’ సినిమా ప్రమోషన్స్ ని కూడా ఇంటరెస్టింగ్ గా ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రకుల్ ప్రీత్ సింగ్, దర్శకుడు హీరోని  ఈ సినిమాలోని డైలాగ్ చెప్తూ క్వశ్చన్ చేసే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తన సినిమా ప్రమోషన్స్ కి హీరోయిన్స్ ప్రమోట్ చేయడం రొటీనే అయినా, తన ఫెవరేట్ డైరెక్టర్ సినిమా కోసం ప్రమోట్ చేస్తూ సమ్ థింగ్ స్పెషల్ అనిపించుకుంది రకుల్. ఈ సినిమాకి హరి ప్రసాద్ జక్కా డైరెక్టర్.