వారి దారిలోనే....

Saturday,October 08,2016 - 05:00 by Z_CLU

స్టార్ హీరోయిన్స్ హిట్స్ అందుకోగానే రెమ్యునరేషన్ పెంచడం మామూలే. అయితే  తాజాగా టాలీవుడ్ లో వరుస బడా ఆఫర్స్ అందుకంటూ టాప్ హీరోయిన్ రేస్ లో దూసుకుపోతున్న రకుల్ కూడా ఇదే ఫార్మేట్ ను ఫాలో అవుతోంది .

       ఇటీవలే ‘నాన్నకు ప్రేమతో’, ‘సరైనోడు’ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న ఈ భామ తాజాగా తన రెమ్యునరేషన్ పెంచేసిందనే టాక్ ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది. ఈ విషయం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూ లో స్పందించింది ఈ ముద్దుగుమ్మ.  అవును నా రెమ్యునరేషన్ పెంచిన మాట వాస్తవమే. అలా పెంచితే  తప్పేంటి?అంటూ సమాధానం ఇచ్చింది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెతను రకుల్ బాగా అలవరుచుకుంటుంది కాబోలు. ప్రస్తుతం  ఈ అమ్మడు రామ్ చరణ్ సరసన ”ధృవ”, మహేష్ బాబు తో ఓ సినిమా చేస్తుంది…