అపజయాలకు 'చెక్' పెడుతుందా?

Wednesday,June 24,2020 - 12:39 by Z_CLU

ఏ ఇండస్ట్రీలో అయినా సక్సెస్ కే ప్రాధాన్యం. ఇది అందరికి తెలిసిన సూత్రమే. ప్రస్తుతం రకుల్ విషయంలో కూడా అదే జరుగుతుంది. తక్కువ టైం లో స్టార్ట్ హీరోయిన్ గా ఎదిగిన ఈ బ్యూటీ చేతిలో ఇప్పుడు తెలుగులో పెద్దగా సినిమాలు లేవు. ‘మన్మథుడు 2’ సినిమా ఎఫెక్ట్ తో అమ్మడికి భారీ ఆఫర్లు రావడం లేదు. దీంతో నితిన్ తో చేస్తున్న ‘చెక్’ సినిమా మీదే ఆశలు పెట్టుకుంది రకుల్.

చంద్ర శేఖర్ ఏలేటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘చెక్’ సినిమాలో లాయర్ గా నటిస్తుంది రకుల్. పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్ర దక్కడంతో తనకి మళ్ళీ భారీ ఆఫర్లు తెచ్చిపెట్టే సినిమా అవుతుందని భావిస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది రకుల్.

మరి రకుల్ అపజయాలకు ఈ సినిమా చెక్ పెట్టి తెలుగులో ఆమెను మళ్ళీ బిజీ హీరోయిన్ ను చేస్తుందా చూడాలి.