స్టార్ హీరోయిన్ ధైర్యం చేస్తోందిగా

Thursday,August 20,2020 - 01:14 by Z_CLU

ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల్లో స్టార్ హీరోలతో పాటు హీరోయిన్స్ కూడా షూటింగ్స్ కి దూరంగా ఉంటూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. అయితే స్టార్ హీరోయిన్స్ లిస్టులో ఉన్న Rakul Preet మాత్రం ధైర్యం చేసి ముందడుగు వేస్తుంది.  తాజాగా షూటింగ్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సెట్స్ లో సందడి చేయబోతుంది ఈ ముద్దుగుమ్మ.

Vaishnav Tej హీరోగా Krish Jagarlamudi డైరక్షన్ లో వస్తున్న సినిమాకు డేట్స్ ఇచ్చి సినిమా సైన్ చేసింది రకుల్. వచ్చే నెల నుండి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతుంది. ఈ సినిమా కోసం కొన్ని రోజులు మాత్రమే కేటాయించనుంది.

ఇక బాలీవుడ్ లో కూడా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆ షూటింగ్ లో పాల్గొనడానికి రెడీ అవుతుందట రకుల్. ఇలా స్టార్ హీరోయిన్స్ ఎవ్వరూ బయటికి రాకుండా ఉన్న సమయంలో పంజాబీ బ్యూటీ పెద్ద సాహసమే చేస్తోందనే చెప్పాలి.