హమ్మయ్య.. మొత్తానికి రకుల్ సాధించింది

Monday,May 20,2019 - 03:24 by Z_CLU

సౌత్ లో సూపర్ హిట్ హీరోయిన్ అనిపించుకుంది. హిందీలో మాత్రం ఆమెకు ఆ ట్యాగ్ లైన్ దక్కలేదు. ఎట్టకేలకు బాలీవుడ్ లో కూడా క్లిక్ అయింది రకుల్. రీసెంట్ గా ఆమె నటించిన సినిమాకు అక్కడ పాజిటిక్ టాక్ వచ్చింది.

అజయ్ దేవగన్ హీరోగా “దే దే ప్యార్ దే” అనే సినిమా చేసింది రకుల్. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు మొదట మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ ఆ తర్వాత పాజిటివ్ టాక్ అందుకుంది. దీంతో ఊపిరి పీల్చుకుంది రకుల్. అలా బాలీవుడ్ లో ఫస్ట్ హిట్ కొట్టింది.

ఇంతకుముందు హిందీలో 2 సినిమాలు చేసింది ఈ భామ. ఆ రెండూ ఫ్లాప్ అయ్యాయి. దీంతో పూర్తిగా తెలుగు-తమిళ సినిమాలకే పరిమితమైంది. ఇక ఆఖరి ప్రయత్నం అన్నట్టు హిందీలో మరోసారి ప్రయత్నించి హిట్ కొట్టింది. తాజా సక్సెస్ తో ఆమెకు బాలీవుడ్ ఆఫర్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం తెలుగులో ఆమె ఒకే ఒక్క సినిమా చేస్తోంది. నాగ్ సరసన మన్మధుడు-2లో నటిస్తోంది.