పవన్ కి హీరోయిన్ ఫిక్స్ ?

Saturday,November 12,2016 - 02:00 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస బడా సినిమాలతో టాప్ హీరోయిన్ ఇమేజ్ తో దూసుకుపోతున్న రకుల్ ప్రీత్ సింగ్ మరో క్రేజీ ఆఫర్ అందుకుందట. ఇటీవలే ‘నాన్నకు ప్రేమతో’, ‘సరైనోడు’ వంటి బడా సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ సొంతం చేసుకున్న రకుల్  సూపర్ స్టార్ మహేష్ సినిమాలో హీరోయిన్ గా బంపర్ ఆఫర్ అందుకున్న విషయం తెలిసిందే. అయితే  తాజాగా రకుల్ మరో బంపర్ ఆఫర్ అందుకుందనే వార్త ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది.

rakul-preet-singh-beautiful-hot-in-tight-black-dress

    వివరాల్లోకెళితే రకుల్ త్వరలోనే పవన్ సినిమాలో హీరోయిన్ గా నటించబోతుందట. అయితే రకుల్ పవన్ సరసన నటించేది త్రివిక్రమ్ సినిమాలో కాదట  నేసన్ దర్శకత్వం లో తెరకెక్కనున్న ‘వేదలమ్’ రీమేక్ లో అని సమాచారం. వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్ గా రకుల్ దాదాపు ఖాయం అనే టాక్ వినిపిస్తుంది.  ఇప్పటికే మెగా కాంపౌండ్ లో రామ్ చరణ్, బన్నీ లతో వరుసగా సినిమాలు చేసిన రకుల్ ఈ సినిమాతో మరో మెగా అఫర్ సొంతం చేసుకోబోతుందన్న మాట.