"పలాస" హీరో రక్షిత్ నెక్స్ట్... భారీ ప్రాజెక్ట్ కి రెడీ

Friday,July 24,2020 - 02:53 by Z_CLU

“పలాస 1978” తో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రక్షిత్ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు “W H O” (World Hazard Ordinance ) అనే టైటిల్ ని నిర్ధారించారు. కరోనా వైరస్ వెనక ఎలాంటి కుట్ర జరిగిందనే నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుంది.

సైబర్ హ్యాకింగ్ బ్యాక్ డ్రాప్ లో సైంటిఫిక్ థ్రిల్లర్ గా రానున్న ఈ మూవీని సుధాస్ మీడియా సమర్పణలో  ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ భారీ స్థాయిలో నిర్మించబోతుంది.

“I’m gonna tell god everything” వంటి వైవిధ్య మైన హాలీవుడ్ షార్ట్ ఫిలిం తో విమర్శకుల ప్రశంసలు తో పాటు అంతర్జాతీయ గుర్తింపు పొందిన దేవ్ పిన్నమరాజు ఈ కథ తో దర్శకుడి గా పరిచయం కాబోతున్నాడు.

ఈ సినిమా షూటింగ్ ను అమెరికా, ఇటలీ, సౌత్ ఆఫ్రికా, ఇండియా-చైనా బార్డర్ లో చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.