కరోనా బ్యాక్ డ్రాప్ లో రక్షిత్ కొత్త సినిమా

Friday,June 19,2020 - 08:02 by Z_CLU

“పలాస 1978” తో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రక్షిత్ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా కు “W H O” (World Hazard Ordinance ) అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

కరోనా వైరస్ వెనక ఎలాంటి కుట్ర జరిగిందనే నేపథ్యంలో ఈ సినిమా రానుంది. హ్యాకింగ్ బ్యాక్ డ్రాప్ లో సైంటిఫిక్ థ్రిల్లర్ గా రానున్న ఈ మూవీని సుధాస్ మీడియా సమర్పణలో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ భారీ స్థాయిలో నిర్మించబోతుంది.

ప్రాజెక్ట్ ను ఎనౌన్స్ చేయడంతో పాటు హీరో రక్షిత్ ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. “I’m gonna tell god everything” వంటి వైవిధ్య మైన హాలీవుడ్ షార్ట్ ఫిలింతో విమర్శకుల ప్రశంసలతో పాటు అంతర్జాతీయ గుర్తింపు పొందిన దేవ్ పిన్నమరాజు ఈ కథ తో దర్శకుడి గా పరిచయం కాబోతున్నాడు.

ఈ సినిమా షూటింగ్ ను అమెరికా, ఇటలీ, సౌత్ ఆఫ్రికా, ఇండియా-చైనా బార్డర్ లో చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.