రక్షిత్ ఇంటర్వ్యూ

Monday,November 13,2017 - 04:10 by Z_CLU

తమిళంలో సూపర్ హిట్టయిన ‘ఆండవాన్ కట్టలై’ కి రీమేక్ గా తెరకెక్కింది ‘లండన్ బాబులు’ మూవీ. ఇమోషనల్ హిలేరియస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ద్వారా ‘రక్షిత్’ టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. చిన్నికృష్ణ  డైరెక్షన్ లో మారుతి నిర్మించిన ఈ సినిమా గురించి మరిన్ని డీటేల్స్ రక్షిత్ మాటల్లో…

అలా జరిగింది….

నేను ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడు మారుతి గారు సినిమాల్లో నటిస్తావా అని అడిగారు… అప్పటికీ నేను డెసిషన్ తీసుకోలేదు… మళ్ళీ నేను హైదరాబాద్ కి వచ్చినపుడు ఈ సినిమాని తమిళంలో చూడటం, నాక్కూడా ఇలాంటి సినిమాలో నటిస్తే బావుంటుందనిపించడం అలా జరిగింది…

అదే సినిమా స్టోరీ…

లండన్ కి వెళ్లి డబ్బులు సంపాదించుకోవాలి అనుకునే ఒక  మిడిల్  క్లాస్ అబ్బాయి, లండన్ వెళ్ళడానికి ఎలాంటి తిప్పలు పడతాడు..? ఈ ప్రాసెస్ లో తప్పులు చేయడం.. ఆ తరవాత ఇబ్బందులు పడటం అదే సినిమా మెయిన్ స్టోరీ…

మెసేజ్ ఉండదు…

ఫారిన్ వెళ్లాలనుకునే యూత్ కి మెసేజ్ లాంటి ఎలిమెంట్స్ పెద్దగా ఉండవు కానీ యూత్ రిలేటెడ్ స్టోరీ కాబట్టి, ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు…

అంతా ఆయనే చేశారు…

నాది ఫస్ట్ మూవీ కాబట్టి మ్యాగ్జిమం మారుతి గారే చూసుకున్నారు. సినిమా సెట్స్ పైకి రాకముందు యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకున్నాను, కానీ మారుతి గారు ఈ సినిమా కోసం న్యాచురల్ గానే ఉంటె బావుటుంది. స్పెషల్ గా ట్రైనింగ్ అవసరం లేదు అన్నారు.. ఇక అలాగే చేసేశాను…

 

స్వాతి సినిమాకు పెద్ద ప్లస్….

స్వాతి గారు సినిమాల విషయంలో చాలా చూజీగా ఉంటారు. అలాంటిది లక్కీగా నా ఫస్ట్ సినిమాలో ఆవిడ నటించడం నాకు పెద్ద ప్లస్ అనే అనుకుంటున్నాను. స్వాతి ఈ సినిమాలో రిపోర్టర్ గా, కీ రోల్ ప్లే చేశారు…

నెక్స్ట్ ప్రాజెక్ట్స్

నెక్స్ట్ సినిమా ఇంకా అనుకోలేదు కానీ వచ్చే ఏడాది మారుతి గారి డైరెక్షన్ లో ఖచ్చితంగా ఒక సినిమా ఉంటుంది…