రాక్షసుడు లోగో రిలీజ్.. రేపు ఫస్ట్ లుక్

Friday,April 05,2019 - 06:31 by Z_CLU

తమిళ్ లో సూపర్ హిట్ అయిన రాట్ససన్ సినిమాను హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు రాక్షసుడు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇప్పుడు అదే టైటిల్ తో
లోగో రిలీజ్ చేశారు.

ఉగాది సందర్భంగా రాక్షసుడు లోగోను ఒక రోజు ముందే విడుదల చేసిన బెల్లంకొండ, రేపు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించాడు. సైకో థ్రిల్లర్ కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు బెల్లంకొండ.

పోలీస్ పాత్రలు బెల్లంకొండకు కొత్తకాదు. కవచం సినిమాలో ఆల్రెడీ ఖాకీ చొక్కా వేశాడు. కాకపోతే కవచం సినిమాకు, రాక్షసుడుకు ఎలాంటి పోలికలు ఉండవంటున్నాడు. రేపు ఉదయం 11 గంటలకు ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుంది.