రాక్షసుడు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్

Monday,August 05,2019 - 03:15 by Z_CLU

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటించిన థ్రిల్లర్ మూవీ రాక్షకుడు హిట్ అయింది. ఫస్ట్ వీకెండ్ నాటికి ఈ సినిమా 50శాతం రికవరీ అయింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు విడుదలైన 3 రోజుల్లో 5 కోట్ల 75 లక్షల రూపాయల షేర్ రాగా.. వరల్డ్ వైడ్ ఆరున్నర కోట్ల రూపాయల షేర్ టచ్ చేశాడు రాక్షకుడు.

రీజనబుల్ రేట్స్ కు సినిమాను ఇవ్వడంతో 3 రోజులకే సగం రికవరీ అవ్వగలిగింది రాక్షసుడు మూవీ. ఆల్రెడీ హిట్ టాక్ రావడం, ప్రస్తుతం మార్కెట్లో పెద్దగా కాంపిటిషన్ లేకపోవడంతో ఈ వీకెండ్ నాటికి ఈ సినిమా బ్రేక్-ఈవెన్ అయ్యే అవకాశాలున్నాయని ట్రేడ్ అంచనా వేస్తోంది.

ఏపీ, నైజాం 3 రోజుల షేర్స్
నైజాం – రూ. 2.30 కోట్లు
సీడెడ్ – రూ. 0.85 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.85 కోట్లు
ఈస్ట్ – రూ. 0.40 కోట్లు
వెస్ట్ – రూ. 0.31 కోట్లు
గుంటూరు – రూ. 0.43 కోట్లు
కృష్ణా – రూ. 0.42 కోట్లు
నెల్లూరు – రూ. 0.17 కోట్లు