రాక్షసుడు మొదటి వారం వసూళ్లు

Saturday,August 10,2019 - 02:30 by Z_CLU

బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా నటించిన రాక్షసుడు సినిమా మొదటి వారం వసూళ్లు బాగున్నాయి. నిన్నటితో వారం రోజుల రన్ పూర్తిచేసుకున్న ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో అటుఇటుగా 9 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. కలెక్షన్ బాగుంది కానీ బ్రేక్-ఈవెన్ మాత్రం అవ్వలేదు. నిజానికి సాయి గత సినిమాలతో పోల్చిచూస్తే, ఈ సినిమాను కాస్త తక్కువ రేట్లకే అమ్మారు. అయినప్పటికీ బ్రేక్-ఈవెన్ కు ఇంకాస్త టైమ్ పట్టేలా ఉంది.

రెవెన్యూ పరంగా చూసుకుంటే ఈ సినిమా ఇప్పటివరకు 60శాతం రికవరీ అయింది. మరో వీకెండ్ గడిస్తే ఈ సినిమా బ్రేక్-ఈవెన్ అయ్యే అవకాశాలున్నాయంటోంది ట్రేడ్. నైజాంలో మాత్రం ఈ సినిమా సూపర్ స్ట్రాంగ్ గా నడుస్తోంది.

ఏపీ, నైజాం 7 రోజుల షేర్
నైజాం – రూ. 3.20 కోట్లు
సీడెడ్ – రూ. 1.10 కోట్లు
ఉత్తరాంధ్ర -రూ. 1.12 కోట్లు
ఈస్ట్ – రూ. 0.60 కోట్లు
వెస్ట్ – రూ. 0.45 కోట్లు
గుంటూరు – రూ. 0.61 కోట్లు
నెల్లూరు – రూ. 0.25 కోట్లు
కృష్ణా – రూ. 0.60 కోట్లు