రాక్షసుడు ఫస్ట్ డే కలెక్షన్

Saturday,August 03,2019 - 02:06 by Z_CLU

ఎట్టకేలకు బెల్లంకొండకు ఓ విజయం దక్కింది. మాస్ ఇమేజ్ పక్కనపెట్టి మరీ డిఫరెంట్ కథలు ట్రై చేస్తున్న ఈ హీరో, ఎట్టకేలకు రీమేక్ సినిమా రాక్షసుడుతో హిట్ కొట్టాడు. రమేష్ వర్మ దర్శకత్వంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో మొదలైంది.

ఇక వసూళ్ల విషయానికొస్తే మొదటిరోజు ఈ సినిమాకు ఏపీ, నైజాంలో కలుపుకొని అటుఇటుగా 2 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. ఈ సినిమాకు జరిగిన ప్రీ-రిలీజ్ బిజినెస్, బెల్లంకొండ తాజా మార్కెట్ తో పోల్చి చూసుకుంటే ఇది డీసెంట్ ఎమౌంట్ కిందే లెక్క. సినిమాకు ఎలాగూ హిట్ టాక్ వచ్చింది కాబట్టి.. ఈరోజు, రేపు వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది

ఏపీ, నైజాం ఫస్ట్ డే షేర్లు
నైజా – రూ. 0.63 కోట్లు
సీడెడ్ – రూ. 0.30 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.34 కోట్లు
ఈస్ట్ – రూ. 0.14 కోట్లు
వెస్ట్ – రూ. 0.13 కోట్లు
గుంటూరు – రూ. 0.23 కోట్లు
కృష్ణా – రూ. 0.13 కోట్లు
నెల్లూరు – రూ. 0.06 కోట్లు