పదేళ్ళ రాఖీ

Thursday,December 22,2016 - 04:30 by Z_CLU

కలర్ ఫుల్ సినిమాల డైరెక్టర్ కృష్ణవంశీ, NTR కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ యాక్షన్ ఎంటర్ టైనర్ రాఖీ. ఈ సినిమా సరిగ్గా పదేళ్ళ క్రితం డిసెంబర్ 22 న రిలీజయింది. NTR కరియర్ లోనే డిఫెరెంట్ జోనర్ లో తెరకెక్కిన రాఖీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

వరకట్న వేధింపులకు, అమ్మాయిలపై బహిరంగంగా జరిగే ఆసిడ్ దాడులకు వ్యతిరేకంగా చట్టాన్ని చేతిలోకి తీసుకుని తిరుగుబాటు చేసే యువకుడిగా NTR యాక్టింగ్ క్రిటిక్స్ చేత కూడా భేష్ అనిపించుకుంది. మెసేజ్ ఓరియంటెడ్ సినిమానే అయినా కృష్ణవంశీ ఏ మాత్రం కమర్షియల్ వ్యాల్యూస్ తగ్గకుండా సినిమాని సరిగ్గా ప్లాన్ చేసుకున్నాడు.

సుహాసిని మణిరత్నం ఒక స్పెషల్ క్యారెక్టర్ లో నటించిన ఈ సినిమాలో NTR సరసన ఇలియానా, ఛార్మి నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.