తమన్నా ప్లేస్ లో ఆ హీరోయిన్ ?

Sunday,June 30,2019 - 03:01 by Z_CLU

ఇటివలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ‘రాజు గారి గది 3’ నుండి తమన్నా తప్పుకుంది. తమన్నా హీరోయిన్ గా తప్పుకోవడంతో ఆ ప్లేస్ లో ఇప్పుడు తాప్సీ ని తీసుకునే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ప్రస్తుతానికైతే తాప్సీషెడ్యుల్ బిజీ… కాకపోతే  కథ, క్యారెక్టర్ నచ్చితే  ఈ సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేసే ఛాన్స్ ఉంది.

ఓక్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై ఓంకార్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సారధి స్టూడియోస్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతానికి హీరో అశ్విన్, మిగతా నటులపై కొన్ని సీన్స్ తీస్తున్నారు. వన్స్ హీరోయిన్ కన్ఫర్మ్ అవ్వగానే మిగతా సన్నివేశాలు తీస్తారు. మరి ‘రాజుగారి గది 3’ లో హీరోయిన్ ఎవరనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.