రాజుగారి గది 3 ఫస్ట్ వీకెండ్ కలెక్షన్
Monday,October 21,2019 - 01:09 by Z_CLU
అనుకున్నట్టుగానే జరిగింది. రాజుగారి గది 3 సినిమా బి, సి సెంటర్లలో సూపర్ గా క్లిక్ అయింది. ఈ సినిమా కంటెంట్, ఇందులో కామెడీ మల్టీప్లెక్స్ ఆడియన్స్ కంటే మిగతా ప్రేక్షకులకే బాగా కనెక్ట్ అవుతుందంటూ మొదటి రోజే రివ్యూలు వచ్చాయి. ఆ సమీక్షలకు తగ్గట్టే సినిమా ఆడుతోంది. మొదటి రోజు కోటి పాతిక లక్షల రూపాయల డీసెంట్ కలెక్షన్ తో ప్రారంభమైన రాజుగారి గది 3 సినిమా.. ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి 3 కోట్ల 50 లక్షల రూపాయల షేర్ సాధించింది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా అటుఇటుగా 4 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. ప్రస్తుతం నడుస్తున్న టాక్ ప్రకారం చూసుకుంటే, మరో 3 రోజుల్లో ఈ సినిమా బ్రేక్-ఈవెన్ సాధించే అవకాశాలున్నాయి. ఈ వీకెండ్ నాటికి సినిమాకు లాభాలు రావొచ్చంటోంది ట్రేడ్.
సినిమాలో కామెడీ కంటెంట్ కాస్త అతిగా ఉంది. కొన్ని సీన్స్ ను మల్టీప్లెక్స్ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేసినప్పటికీ.. సెకెండాఫ్ లో వచ్చే కామెడీ మాత్రం పూర్తిగా సి-సెంటర్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకొని తీసినట్టు తెలుస్తోంది. ఇప్పుడు రిజల్ట్ కూడా ఆ సెంటర్ల నుంచే పాజిటివ్ గా వస్తోంది. మరోవైపు రాజుగారి గది 3తో పాటు థియేటర్లలోకి వచ్చిన ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయింది.