రాజుగారి గది 3 ఫస్ట్ డే కలెక్షన్

Saturday,October 19,2019 - 01:56 by Z_CLU

అన్నీతానై ఓంకార్ తెరకెక్కించిన రాజుగారి గది 3 సినిమాకు మొదటి రోజు డీసెంట్ వసూళ్లు వచ్చాయి. టైటిల్ పై క్రేజ్ ఉండడం, సినిమాలో కామెడీ బాగుంటుందనే అంచనాలు ఉండడంతో.. మొదటి రోజు ఈ సినిమాకు చెప్పుకోదగ్గ స్థాయిలో వసూళ్లు వచ్చాయి. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు కోటి 25 లక్షల రూపాయల షేర్ వచ్చింది.

సినిమాలో మంచి కామెడీ ఉంది. దీంతో పాటు ఓ మోస్తరు ఓవర్ డోస్ కామెడీ కూడా ఉంది. కాబట్టి బి, సి సెంటర్లలో ఈ సినిమా క్లిక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓంకార్ నమ్మకం కూడా అదే. సో.. ఈ సినిమా కమర్షియల్ రిజల్ట్ ఏంటో తెలియాలంటే ఈరోజు, రేపు వెయిట్ చేయాల్సిందే.

ఏపీ, నైజాం ఫస్ట్ డే షేర్
నైజాం – రూ. 42 లక్షలు
సీడెడ్ – రూ. 24 లక్షలు
ఉత్తరాంధ్ర – రూ. 16 లక్షలు
ఈస్ట్ – రూ. 10 లక్షలు
వెస్ట్ – రూ. 6 లక్షలు
గుంటూరు – రూ. 14 లక్షలు
నెల్లూరు – రూ. 4 లక్షలు
కృష్ణా – రూ. 9 లక్షలు