గుమ్మడికాయ కొట్టిన రాజుగారి గది-2 యూనిట్

Thursday,September 07,2017 - 10:54 by Z_CLU

నాగార్జున హీరోగా నటిస్తున్న రాజుగారి గది-2 సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. తాజాగా ఈ సినిమా షూటింగ్ కు ప్యాకప్ చెబుతూ గుమ్మడి కాయ ఫంక్షన్ నిర్వహించారు. నాగార్జునతో పాటు యూనిట్ సభ్యులంతా ఇందులో పాల్గొన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తిచేసి, అక్టోబర్ 13న సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించారు.

నిజానికి రాజుగారిగది-2 సినిమా చాన్నాళ్ల కిందటే పూర్తికావాల్సింది. కానీ గ్రాఫిక్స్ వర్క్ వల్ల కాస్త లేట్ అయింది. పర్ఫెక్షన్ కోసం కొన్ని సన్నివేశాల్ని రీషూట్ చేయడం కూడా మరో కారణం. ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మెంటలిస్ట్ గా కనిపించబోతున్నాడు నాగార్జున.

నాగ్ కాబోయే కోడలు సమంత ఇందులో ఓ కీలక పాత్రలో కనిపించనుంది. సమంత లుక్ కు సంబంధించిన స్టిల్స్ ను ఇప్పటికే విడుదలచేశారు. సినిమాలో నాగ్ సరసన సీరత్ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అశ్విన్, వెన్నెల కిషోర్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. పీవీపీ, మేట్నీ మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.