రాజుగారి గది 2 రిలీజ్ డేట్

Monday,July 24,2017 - 03:04 by Z_CLU

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ‘రాజు గారి గది 2’ రిలీజ్ డేట్ ఫిక్సయింది. సమంతా కీ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాలో నాగార్జున సరసన సీరత్ కపూర్ నటిస్తుంది. అక్టోబర్ 13 న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఓంకార్ ఈ సినిమాకి డైరెక్టర్.

నాగార్జున కరియర్ లోనే ఫస్ట్ టైమ్ హారర్ జోనర్ లో నటించడం ఈ సినిమాపై స్పెషల్ ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తుంది. హారర్ తో పాటు అల్టిమేట్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓంకార్ తమ్ముడు అశ్విన్ కూడా ఓ స్పెషల్ రోల్ లో నటించాడు. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాకి PVP ప్రొడ్యూసర్.