రాజ్ తరుణ్ సినిమా మొదలైంది

Monday,April 22,2019 - 03:40 by Z_CLU

‘లవర్’ సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్న రాజ్ తరుణ్ ఎట్టకేలకు నెక్స్ట్ సినిమాను స్టార్ట్ చేసాడు. దిల్ రాజు నిర్మాణంలో జి.ఆర్‌.కృష్ణ‌ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు రాజ్ తరుణ్. ఈ సినిమాకు ‘ఇద్దరి లోకం ఒకటే’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు. ఈ సినిమా ఈరోజే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా నెలాఖరు నుండి సెట్స్ పైకి వెళ్లనుంది.

యూత్ & ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకు అబ్బూరి రవి మాటలు అందిస్తుండగా మిక్కే జే. మేయర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుంది.