తమిళ్ రిమేక్ తో రాజ్ తరుణ్ ?

Sunday,June 03,2018 - 05:03 by Z_CLU

ఇటివలే ‘రాజుగాడు’ సినిమాతో థియేటర్స్ లోకొచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్… ప్రస్తుతం ఓ తమిళ్ సినిమాను తెలుగులో రిమేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. తమిళ్ లో సూపర్ హిట్ గా నిలిచిన ‘నానుమ్ రౌడి దాన్’ సినిమాను తెలుగులో రిమేక్ చేయబోతున్నారట. ఈ సినిమా రైట్స్ ను సొంతం చేసుకున్న c.కళ్యాణ్ రాజ్ తరుణ్ తో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారని సమాచారం.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయాయ్యని , ఈ సినిమాను వసిష్ట్ అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేయనున్నాడని తెలుస్తుంది. త్వరలోనే ఈ రిమేక్ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారట మేకర్స్.