స్పీడ్ తగ్గించబోతున్న రాజ్ తరుణ్

Sunday,May 27,2018 - 12:05 by Z_CLU

ప్రస్తుతం యంగ్ హీరోలందరూ రెండు మూడు సినిమాలను సెట్స్ పై పెట్టేస్తూ ఫుల్ బిజీ అవుతుంటే… నేను మాత్రం స్పీడ్ తగ్గించేస్తా అంటున్నాడు రాజ్ తరుణ్. ఇటివలే రాజుగాడు సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూ లో ఒకటి ఫినిష్ చేసాకే మరో సినిమా చేస్తానని చెప్పుకొచ్చాడు ఈ యంగ్ హీరో.

ప్రస్తుతం ‘లవర్’ సినిమాతో సెట్స్ పై ఉన్న రాజ్ తరుణ్ త్వరలోనే ‘కుమారి 21f’ఫేం సూర్య ప్రతాప్ తో ఓ సినిమా చేయబోతున్నాడు.. ఈ సినిమా తర్వాత వసిశ్ట్ అనే కొత్త దర్శకుడితో మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడు.

ప్రస్తుతానికి ఈ రెండు సినిమాలు మాత్రమే తన చేతిలో ఉన్నాయని… కొన్ని కథలు కూడా వింటున్నాని..కానీ ఒక సినిమా తర్వాత మరొకటి స్టార్ట్ చేయాలనీ డిసైడ్ అయ్యానని చెప్పుకొచ్చాడు రాజ్ తరుణ్. సో ఇకపై రాజ్ తరుణ్ నుండి ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలు మాత్రమే ఉంటాయన్నమాట.