రాజీవ్ కనకాల బర్త్ డే స్పెషల్..

Sunday,November 13,2016 - 10:10 by Z_CLU

ఈరోజు రాజీవ్ కనకాల పుట్టినరోజు. విలక్షణ నటుడిగా పేరుతెచ్చుకున్న రాజీవ్ కనకాల చేసిన విభిన్న పాత్రలపై జీ-సినిమాలు స్పెషల్ ఫోకస్…

 jantha-garage

నటుడిగా రాజీవ్ కనకాల ఎన్నో విభిన్న పాత్రలు చేసినప్పటికీ ప్రస్తుతం నటుడిగా ఆయనకు ఎనలేని గుర్తింపు తీసుకొచ్చిన చిత్రం ‘జనతా గ్యారేజ్’. ఈ చిత్రం లో ఓ సిన్సియర్ మున్సిపల్ ఆఫీసర్ గా రాజీవ్ కనకాల నటన సినిమాకు ఆయువు పట్టుగా నిలిచిందనే చెప్పాలి. తన అల్టిమేట్ పర్ ఫార్మెన్స్ తో సినిమాను ఓ మలుపు తిప్పాడు కనకాల.

 

nannku-prematho

 నటుడిగా రాజీవ్ కనకాల కు మరో గుర్తింపు తీసుకొచ్చిన చిత్రం ‘ నాన్నకు ప్రేమ’. ఈ చిత్రం లో ఒక సెల్ఫిష్ పాత్రలో ఎన్టీఆర్ కు అన్నయ్య గా రాజీవ్ కనకాల నటన బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో రాజీవ్, ఎన్టీఆర్ మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను అలరించాయి.

resugurram

రేసుగుర్రం సినిమాలో రాజీవ్ కనకాల పాత్ర.. అతడు పోషించిన బెస్ట్ క్యారెక్టర్స్ లో ఒకటిగా నిలిచిపోతుంది. కనకాల పోషించిన పోలీస్ పాత్రల్లో ఇది ఒన్ ఆఫ్ ది బెస్ట్. ఈ చిత్రంలో రౌడీ ముందు తలదించుకుని… క్లైమాక్స్ లో రౌడీ ని చంపే సన్నివేశంలో రాజీవ్ కనకాల జీవించాడు.

 

sye

రాజమౌళి డైరక్ట్ చేసిన ఈ సినిమాలో రాజీవ్  కనకాల అద్భుతమైన పాత్ర పోషించాడు. హీరో నితిన్ అయినప్పటికీ.. ఆ హీరోలో కూడా ప్రేరణ కల్పించే పాత్రను పోషించాడు రాజీవ్. రగ్బీ కోచ్ గా డిఫరెంట్ గా కనిపించి మెప్పించాడు.

athdu

త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ట్రయిన్ ఎపిసోడ్ లో మాత్రమే రాజీవ్ కనిపిస్తాడు. కాానీ సినిమా అంతా రాజీవ్ చుట్టూనే తిరుగుతుందంటే సినిమాలో అతడి పాాత్ర ఎంత కీలకమైందో అర్థం చేసుకోవచ్చు.

 

vikramarkudu

నటుడిగా రాజీవ్ ఎన్ని సినిమాలు చేసిన ఆయన కెరీర్ లో ‘విక్రమార్కుడు’ చిత్రం ప్రత్యేకం. ఆ సినిమాతో రాజీవ్ కనకాల పోలీస్ పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ అయిపోయాడు.

ontari

అప్పటివరకూ పాజిటివ్ పాత్రలతో నటుడిగా  గుర్తింపు అందుకున్న రాజీవ్ కనకాలను ఒక్కసారి నెగిటీవ్ షేడ్ లో చూపించిన చిత్రం ‘ఒంటరి’. ఒక సరైన నటుడికి  నెగిటీవ్ పాత్ర వస్తే ఏ రేంజ్ లో అదరగొట్టగలడో ఆ పాత్రతో చూపించాడు రాజీవ్ కనకాల.

nayak

ఈ చిత్రం లో ఓ సాధారణ వ్యక్తి గా రౌడీయిజంపై తిరగబడే పాత్రలో రాజీవ్ నటన అదుర్స్ అనే చెప్పాలి. ముఖ్యంగా మనకెందుకు అనుకుంటే సమాజం ఏమై పోతుంది? మన వూరు కాదు కదా అనుకుంటే మదర్ థెరిస్సా కూడా సహాయం అందించలేకపోయేది రా అంటూ రామ్ చరణ్ తో చెప్పే డైలాగ్  తో నటుడిగా రాజీవ్ మంచి మార్కులు అందుకున్నాడు.

ashok

అశోక్ సినిమాలో ఎన్టీఆర్ ఆవేశాన్ని కంట్రోల్ చేస్తూ ఎప్పుడు తోడుగా ఉండే ప్రాణ స్నేహితుడిగా రాజీవ్ కనకాల తన నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఈ సినిమాలో రాజీవ్ మృతితో అసలు కథ మొదలవుతుంది.

a-film-arvind

రాజీవ్ కనకాల హీరోగా నటించిన సినిమా. అతడి టాలెంట్ కు పర్ ఫెక్ట్ ఎగ్జాంపుల్. ‘ఎ ఫిలిం బై అరవింద్’ సినిమాలో రాజీవ్ టాలెంట్ మొత్తం కనిపిస్తుంది.