పవర్ ఫుల్ కాలా: ట్రయిలర్ రిలీజ్

Tuesday,May 29,2018 - 01:00 by Z_CLU

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ కాలా. జూన్ 7న రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ గా ట్రయిలర్ రిలీజ్ చేశారు. ఇప్పటికే రిలీజైన టీజర్ కు కొనసాగింపుగా ఉంది ఈ ట్రయిలర్.

రజనీకాంత్ ను ఇప్పటివరకు చూడని ఓ డిఫరెంట్ లుక్ లో కాలాను ప్రజెంట్ చేశారు. నల్ల షర్ట్, నల్ల లుంగీ, నెరసిన గడ్డంతో రజనీ అదరగొట్టాడు. ట్రయిలర్ లో రజనీకాంత్ స్టయిల్, డైలాగ్ డెలివరీ అస్సలు మిస్ కాలేదు. కాకపోతే పంచ్ లు మాత్రం మిస్ అయ్యాయి.

వండర్ బార్ స్టుడియోస్ బ్యానర్ పై రజనీకాంత్ అల్లుడు ధనుష్ నిర్మించిన ఈ సినిమాకు పా.రంజిత్ దర్శకుడు. గతంలో రజనీ-రంజిత్ కాంబోలో కబాలి వచ్చింది. కాలా స్టోరీలైన్ నచ్చడంతో బ్యాక్ టు బ్యాక్ రంజిత్ కే ఛాన్స్ ఇచ్చాడు రజనీకాంత్. మురళీ సినిమాటోగ్రాఫీ, సంతోష్ నారాయణన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రయిలర్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి.