

Monday,May 08,2023 - 04:15 by Z_CLU
తాజాగా తలైవర్, సూపర్ స్టార్ రజినీకాంత్.. ‘లాల్ సలాం’ చిత్రంలో పోషిస్తోన్న ‘మొయిద్దీన్ భాయ్’ క్యారెక్టర్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. లుక్‌ను గమనిస్తే ముస్లిం గెటప్‌లో రజినీకాంత్ రాయల్‌గా నడిచివస్తున్నారు. తలైవర్ మాస్ గెటప్ ఓ రేంజ్‌లో ఉంది. బాషాలో మాణిక్ బాషాగా అలరించిన మన సూపర్ స్టార్ ఇప్పుడు లాల్ సలాంలో మొయిద్దీన్ భాయ్‌గా మెప్పించబోతున్నారు.
ఈ సందర్భంగా లైకా ప్రతినిధులు మాట్లాడుతూ ‘‘డిఫరెంట్ చిత్రాలను అందించటానికి మా లైకా ప్రొడక్షన్ష్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. లాల్ సలాం విషయానికి వస్తే ఐశ్వర్య రజినీకాంత్‌గారి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సూపర్‌స్టార్ రజినీకాంత్‌గారు మొయిద్దీన్ భాయ్ అనే పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించబోతున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన లుక్‌ను విడుదల చేయటం చాలా హ్యాపీగా ఉంటుంది. ఆయన తనదైన స్టైల్‌లో రాకింగ్ పెర్ఫామెన్స్‌తో ఈ చిత్రంలోనూ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటారనటంలో సందేహం లేదు. . ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. విష్ణు రామస్వామి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు’’ అని తెలిపారు.
Wednesday,July 12,2023 06:48 by Z_CLU
Monday,December 12,2022 03:05 by Z_CLU
Wednesday,November 03,2021 01:42 by Z_CLU
Sunday,October 24,2021 11:45 by Z_CLU