సూపర్ స్టార్ మూవీకి కొత్త రిలీజ్ డేట్

Wednesday,July 11,2018 - 12:08 by Z_CLU

ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా
ఇద్దరు సూపర్ స్టార్లు కలిసి నటిస్తున్న మూవీ
ఇలా 2.0 సినిమాపై ఏడాదిగా అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి కానీ ఏమాత్రం తగ్గలేదు. రజనీకాంత్ హీరోగా, శంకర్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మరో సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించి తాజాగా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు.

ఈ ఏడాది నవంబర్ 29న 2.0 మూవీ థియేటర్లలోకి రాబోతున్నట్టు స్వయంగా దర్శకుడు శంకర్ ఎనౌన్స్ చేశాడు. విజువల్ ఎఫెక్ట్స్ అందించే డెడ్ లైన్ ను యానిమేషన్ కంపెనీలు తెలిపాయని, అందుకే సినిమా విడుదల తేదీని అఫీషియల్ గా ప్రకటిస్తున్నామని ట్వీట్ చేశాడు శంకర్.

నిజానికి ఈ సినిమా ఈ పాటికే థియేటర్లలోకి రావాలి. కొన్ని నెలల కిందటే దుబాయ్ లో ఆడియో రిలీజ్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. ట్రయిలర్ కూడా రెడీ అయింది. అంతలోనే అనుకోని కారణాల వల్ల గ్రాఫిక్ వర్క్ ఆగిపోయింది. దీంతో సినిమా విడుదల వాయిదాపడింది.

రజనీకాంత్, ఎమీ జాక్సన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించాడు. ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో వస్తోంది 2.0 సినిమా. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాకు 450 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టినట్టు టాక్.