29 ఏళ్ల తర్వాత అతడితో వర్క్ చేసిన రజనీకాంత్

Wednesday,December 11,2019 - 09:02 by Z_CLU

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన దళపతి సినిమా వచ్చి అటుఇటుగా 29 ఏళ్లు అవుతోంది. మళ్లీ ఇన్నాళ్లకు అప్పటి టెక్నీషియన్ తో పనిచేశాడు రజనీకాంత్. అతడే సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం.

అవును.. దళపతి తర్వాత ఇన్నేళ్లలో సంతోష్ శివన్ తో కలిసి పనిచేయలేదు సూపర్ స్టార్. అలా అని ఇద్దరి మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ లేదు. ఎవరి వర్క్ తో వారు బిజీ అయిపోయారు. మళ్లీ ఇన్నాళ్లకు దర్బార్ సినిమాతో కలిశారు. నిజంగా ఇది అరుదైన విషయం. దర్బార్ సెట్స్ లో ఎన్నోసార్లు అప్పటి ఐకానిక్ మూవీ దళపతి గురించి వీళ్లిద్దరూ మాట్లాడుకున్నారు.

దేశం మెచ్చిన సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్. తన వర్క్ తో ఇప్పటివరకు 11 నేషనల్ అవార్డ్స్ తో పాటు 21 ఇంటర్నేషల్ అవార్డులు అందుకున్నాడీయన. హీరో ఎవరనేది తనకు అనవసరమని, సబ్జెక్ట్ నచ్చితేనే వర్క్ చేస్తానని కరాఖండిగా చెబుతుంటాడు సంతోష్ శివన్. తెలుగులో మహేష్ బాబు నటించిన స్పైడర్ సినిమాకు ఈయనే సినిమాటోగ్రాఫర్. అంతేకాదు.. ఈయనకు తొలి స్ట్రయిట్ మూవీ కూడా ఇదే.