హీరోయిన్లు ఫిక్స్ చేసిన సూపర్ స్టార్

Thursday,February 28,2019 - 03:34 by Z_CLU

తన కొత్త సినిమాకు సంబంధించి హీరోయిన్లను ఫిక్స్ చేశాడు రజనీకాంత్. మురుగదాస్ దర్శకత్వంలో చేయబోయే సినిమాలో నయనతార, కీర్తిసురేష్ ను హీరోయిన్లుగా తీసుకున్నాడు. మార్చి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది.

పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో రాబోతోంది రజనీకాంత్-మురుగదాస్ సినిమా. ఇందులో ఓ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా ఉందట. ఇద్దరు హీరోయిన్లలో ఒకరు ఫ్లాష్ బ్యాక్ లో రాబోతున్నారు. అంటే సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు ఒకరితో ఒకరికి సంబంధం ఉండదన్నమాట.

నయనతారను ఇండస్ట్రీకి పరిచయం చేసిన వ్యక్తి రజనీకాంత్. చంద్రముఖి సినిమాతో ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయిన నయన్, ప్రస్తుతం కోలీవుడ్ లో తిరుగులేని హీరోయిన్ గా కొనసాగుతుంది. మధ్యలో సూపర్ స్టార్ సరసన కథానాయకుడు సినిమా చేసిన ఈ బ్యూటీ, ఇప్పుడు మరోసారి అతడితో కలిసి యాక్ట్ చేయబోతోంది. ఇక కీర్తిసురేష్ కు సూపర్ స్టార్ సినిమా ఛాన్స్ రావడం ఇదే ఫస్ట్ టైం.