రజినీకాంత్ రోబో 2.0 టీజర్ రిలీజ్ డేట్

Tuesday,October 10,2017 - 04:06 by Z_CLU

రజినీకాంత్ రోబో 2.0 ఆడియో రిలీజ్ డేట్ దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫాలో గ్రాండ్ గా జరగనుంది. A.R. రెహమాన్ లైవ్ పర్ఫామెన్స్ తో పాటు మరెన్నో ఇంటరెస్టింగ్ ఎలిమెంట్స్ తో ఎట్రాక్ట్ చేయనున్న ఈ ఈవెంట్ కోసం 12 కోట్లు  స్పెండ్ చేస్తుంది సినిమా యూనిట్. అయితే ఈ ఈవెంట్ తరవాత ఈ సినిమా టీజర్ ని హైదరాబాద్ లో నవంబర్ 22 న రిలీజ్ చేసే ప్రాసెస్ లో ఉంది 2.0 టీమ్.

సినిమా పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉండగానే వరల్డ్ వైడ్ గా ప్రమోషన్స్ బిగిన్ చేసిన సినిమా యూనిట్, ఈ సినిమా ట్రైలర్ ని డిసెంబర్ 12 న రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ విషయం ప్రస్తుతానికి అఫీషియల్  గా అనౌన్స్ చేయలేదు కానీ, రజినీకాంత్ బర్త్ డే సందర్భంగా సినిమా యూనిట్, మ్యాగ్జిమం ఈ డేట్ ని లాక్ చేసే చాన్సెస్ ఉన్నాయంటున్నాయి ఇన్ సైడ్ సోర్సెస్.

శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరి 25 న రిలీజ్ కానుంది. A.R. రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాలో అక్షయ్ కుమార్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఎమీ జాక్సన్ హీరోయిన్ గా నటించింది.