జనవరి 10 న రజినీకాంత్ ‘పేట’ రిలీజ్

Thursday,December 27,2018 - 05:13 by Z_CLU

సూపర్ స్టార్ రజినీకాంత్ ‘పేట’ రిలీజ్ డేట్ ఫిక్సయింది. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ సాంగ్, మాస్ ఆడియెన్స్ కి, వైడ్ రేంజ్ లో రీచ్ అయింది. దానికి తోడు రేపు 11 గంటలకు ఈ సినిమా నుండి ట్రైలర్ కూడా రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో రజినీకాంత్ మాట్లాడుతూ ‘ నేను 1990 లో నటించిన సినిమాల తరహాలో ఈ ‘పేట’ సినిమా ఉండబోతుంది. కార్తీక్ సుబ్బరాజు ఈ కథ చెప్పిన తరవాత, ఎంత మంది వచ్చి ఎన్ని కథలు చెప్పినా, అస్సలు నచ్చలేదు. అందుకే ముందు ఈ సినిమా చేసేసి, ఆ తరవాత తక్కిన కథల సంగతి ఆలోచించాలని ఫిక్సయ్యా’ అని చెప్పుకున్నాడు.

రజినీకాంత్ ని ఆ రేంజ్ లో ఇంప్రెస్ చేసిన స్టోరీ అనగానే న్యాచురల్ గానే ఆడియెన్స్ లో వైబ్రేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. అనిరుద్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేశాడు. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దీఖీ ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్నాడు. సిమ్రాన్, త్రిష హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో మేఘా ఆకాష్ స్పెషల్ రోల్ లో కనిపించనుంది. వల్లభనేని అశోక్ ప్రొడ్యూసర్.