రజినీకాంత్ లింగ మూవీ ఎట్రాక్షన్స్

Saturday,July 29,2017 - 04:17 by Z_CLU

హై ఎండ్ ఎక్స్ పెక్టేషన్ మధ్య రిలీజ్ అయి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ‘లింగ’  సూపర్ స్టార్ రజినీకాంత్ కరియర్ లోనే  మైల్ స్టోన్ లా నిలిచింది. K.S. రవి కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో హైలెట్ గా నిలిచిన ఎట్రాక్టివ్ పాయింట్స్ ఇవే…

రజినీకాంత్ మ్యాజిక్ :  లింగ సినిమాలో ఫస్ట్ ఎట్రాక్షన్ రజినీకాంత్. రెండు డిఫెరెంట్ షేడ్స్ లో కనిపించిన రజినీకాంత్ పర్ఫామెన్స్ సినిమాకి బ్యాక్ బోన్ అయితే,  ఆయన యూనిక్ స్టైల్ బాడీ లాంగ్వేజ్, రెండు క్యారెక్టర్స్ కి మధ్య చూపించిన వేరియేషన్స్ సినిమాకి బిగ్గెస్ట్ ఎసెట్ గా నిలిచాయి.

స్టోరీ లైన్ : లింగ సినిమా సక్సెస్ కి రజినీకాంత్ తరవాత ఇమ్మీడియట్ గా చెప్పుకోదగ్గ ఎసెట్ స్టోరీ. నలుగురికి ఆసరాగా నిలిచే  డ్యామ్ కోసం ఒక వ్యక్తి చేసిన సాక్రిఫైజ్ వృధా కాకుండా సినిమాలోని ఒక్కో పాత్ర పడే తపన సినిమాకి రెండో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్.

 

సోనాక్షి సిన్హా : బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా ఈ సినిమా తోనే సౌత్ ఇండియన్ సినిమాకి ఇంట్రడ్యూస్ అయింది. ఇప్పటికే హిందీ సినిమాల్లో మంచి క్రేజ్ క్రియేట్ చేసుకున్న ఈ భామ, రజినీకాంత్ సరసన పర్ ఫెక్ట్ జోడీ అనిపించుకుంది. ఈ ఇద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ప్రతి ఫ్రేమ్ లో అదుర్స్ అనిపించుకుంది.

అనుష్క షెట్టి : ఇక ‘లింగ’ సినిమాలో స్పెషల్ గా నిలిచిన మరో ఎట్రాక్షన్ టాలీవుడ్ క్వీన్ అనుష్క. అటు గ్లామర్ విషయంలో కానీ, ఇటు పర్ఫామెన్స్ విషయంలో అదరగొట్టిన అనుష్క, కొన్ని పర్టికులర్ సీన్స్ లో రజినీ కాంత్ కి పర్ఫెక్ట్ చాయెస్ అనిపించుకుంది.

యాక్షన్ సీక్వెన్సెస్ :  లింగ సినిమాలోని ఎట్రాక్షన్స్ అన్ని ఒక ఎత్తైతే, ఎత్తి పరిస్థితుల్లో మిస్ కాకూడని మరో ఎట్రాక్షన్ యాక్షన్ సీక్వెన్సెస్. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ లీ వాట్కర్ కంపోజ్ చేసిన ఫైట్స్ సినిమాకి ప్రాణం.

కామెడీ ఎలిమెంట్స్ : సబ్జెక్ట్ ఏదైనా రజినీ కాంత్ సినిమాలో ఆయన ఫేవరేట్ జోనర్ కామెడీ డోస్ ఉండాల్సిందే. సినిమాలో అవసరమైనప్పుడల్లా సంతానం కాంబినేషన్ లో పడే కామెడీ సీన్స్ కడుపు నిండా నవ్వులు వడ్డిస్తాయి.

A.R. రహమాన్ మ్యాజిక్ : రెహమాన్ మ్యూజిక్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. దానికి తోడు సిచ్యువేషనల్ గా రహమాన్ కంపోజ్ చేసిన BGM సినిమాలోని  ప్రతి ఇమోషన్ ని ఆడియెన్స్ కి స్ట్రేట్ గా రీచ్ అయ్యేందుకు సహకరించింది.

ఎగ్జోటిక్ లొకేషన్స్ : లింగ సినిమా జస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మాత్రమే కాదు. విజువల్లీ వండర్ కూడా. కర్నాటక లోని అద్భుతమైన లొకేషన్స్ మెల్కోటే, మనువన, పాండవపుర, చాముండి హిల్స్, జోగ్ ఫాల్స్, మైసూర్ ప్యాలస్ లాంటి లొకేషన్స్ లలో తెరకెక్కిన ఈ సినిమా ఎన్ని సార్లు చూసిన తనివి తీరదు.

ఆర్ట్ వర్క్ : సాధారణంగా ప్రతి సినిమాకి ఆర్ట్ వర్క్ ప్రమేయం పెద్దగా ఉండదు. కొన్ని సినిమాలు ఆర్ట్ వర్క్ పైనే డిపెండ్ అయి ఉంటాయి. ఈ సినిమాలో కూడా ఆర్ట్ వర్క్ చాలా డామినేట్ చేసింది. ముఖ్యంగా ఈ సినిమాలో డ్యామ్ సెట్, ఎక్కడా ఆర్టిఫిషియల్ అనిపించకుండా పక్కాగా ప్లాన్ చేశాడు ఆర్ట్ డైరెక్టర్ అర్మాన్.

ఇన్ని ఎట్రాక్షన్స్ తో తెరకెక్కి,  రిలీజైన ప్రతి సెంటర్ లోను సెన్సేషన్ ని క్రియేట్ చేసిన  బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘లింగ’ ఈ రోజు రాత్రి 8 గంటలకు ప్రసారం అవుతుంది. డోంట్ మిస్ ఇట్.