రజినీకాంత్ కాలా అప్ డేట్స్

Tuesday,June 13,2017 - 05:20 by Z_CLU

రజినీకాంత్ కాలా ముంబాయి షెడ్యూల్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అయింది. ఇక చెన్నైలో ఈ నెల 24 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న సినిమా యూనిట్ ఈ షెడ్యూల్ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ లోపు జూన్ 15 నుండి 2 రోజులపాటు అభిమానులతో భేటి కానున్నాడు రజినీకాంత్.

 

 ఇప్పటికే చెన్నైలో థారావి సెట్ ని  నిర్మించిన సినిమా యూనిట్, తక్కిన షూటింగ్ మొత్తం ఈ సెట్ లోనే ప్లాన్ చేసే చాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో పవర్ ఫుల్ డాన్ లా మెస్మరైజ్ చేయనున్న రజినీకాంత్ సరసన హుమా ఖురేషి, అంజలి పాటిల్ హీరోయిన్స్ గా నటిస్తుండగా నానాపటేకర్ విలన్ గా నటిస్తున్నాడు. పా. రంజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు.