70% షూటింగ్ కంప్లీట్ చేసుకున్న రజినీకాంత్ 'కాలా'

Wednesday,September 13,2017 - 03:02 by Z_CLU

సూపర్ స్టార్ రజినీకాంత్ కాలా షూటింగ్ దాదాపు 70% కంప్లీట్ అయింది.  సమ్మర్ రిలీజ్ ని టార్గెట్ చేసుకున్న ఈ సినిమా మరో 45 రోజుల పాటు జరగనున్న రెగ్యులర్ షూటింగ్ తో కంప్లీట్ షూటింగ్ కి ప్యాకప్ చెప్పే ప్రాసెస్ లో ఉంది.

ఈ సినిమాలో పవర్ ఫుల్ డాన్ లా కనిపించనున్నాడు రజినీకాంత్. హుమా ఖురేషి, అంజలి పాటిల్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి పా. రంజిత్ డైరెక్టర్. బాలీవుడ్ నటుడు నానా పటేకర్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. నారాయణ్ ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.