రజినీకాంత్ ‘కాలా’ ఆడియో రిలీజయింది

Thursday,May 10,2018 - 09:02 by Z_CLU

రజినీకాంత్ ‘కాలా’ ఆడియో రిలీజయింది. సంతోష్ నారాయణ్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమా పాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ స్పేస్ క్రియేట్ చేసుకుంటున్నాయి. మొత్తం 8 సాంగ్స్ తో రిలీజ్ అయిన ‘కాలా’ జ్యూక్ బాక్స్, తలైవా ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేస్తున్నాయి.

గతంలో రజినీకాంత్ కబాలి సినిమాకి దర్శకత్వం వహించిన పా. రంజిత్ డైరెక్షన్ లోనే తెరకెక్కింది కాలా. ఈ సినిమాలో ముంబై బేస్డ్ డాన్ లా కనిపించనున్నాడు రజినీకాంత్. భారీ మాస్ ఎలిమెంట్స్ తోకంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో హుమా ఖురేషి తో పాటు నానాపటేకర్ కీ రోల్స్ ప్లే చేస్తున్నారు.

 

వండర్ బార్స్ బ్యానర్ పై హీరో ధనుష్ నిర్మించిన ఈ సినిమాకి లైకా ప్రొడక్షన్స్ సహ నిర్మాతగా వ్యవహరిస్తుంది. జూన్ 7 న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది ఈ సినిమా.