సినీ వర్కర్లకు 50 లక్షలు విరాళం ఇచ్చిన సూపర్ స్టార్

Tuesday,March 24,2020 - 03:12 by Z_CLU

సూపర్ స్టార్ రజనీకాంత్ సినీ కార్మికులకు 50 లక్షలు విరాళంగా అందజేశారు. కరోనా కారణంగా షూటింగ్స్ అన్నీ నిలిచిపోవడంతో.. రోజువారీ వేతనంపై పని చేసే సినీకార్మికులకు పని లేకుండా పోయింది. వాళ్ల జీవితం అగమ్యగోచరంగా తయారైంది.

అలాంటి వర్కర్స్ అందర్నీ ఆదుకునేందుకు ముందుకొచ్చారు రజనీకాంత్. తన వంతుగా 50 లక్షల రూపాయల సాయం అందించారు. ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా ఆధ్వర్యంలో ఈ విరాళాలు సేకరిస్తున్నారు. వచ్చిన సొమ్ముతో సినీకార్మికుల రోజువారీ జీవనానికి కావాల్సిన సరుకులు అందిస్తారు.

ఇటు టాలీవుడ్ లో హీరో రజనీకాంత్ తన పెద్ద మనసు చాటుకున్నారు. షూటింగ్స్ లేక ఉపాధి కోల్పోయిన రోజువారీ సినీకార్మికుల కోసం తన ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా 10 రోజుల పాటు నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. అటు తమిళ హీరో విజయ్ సేతుపతి కూడా కోలీవుడ్ కార్మికుల కోసం 10 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించారు.