మరో సినిమా ఓకే చేసిన సూపర్ స్టార్

Friday,October 11,2019 - 01:06 by Z_CLU

ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో దర్బార్ సినిమా చేస్తున్నాడు రజనీకాంత్. సంక్రాంతి బరిలో నిలిచింది ఈ మూవీ. ఈ మూవీ తర్వాత చేయబోయే సినిమాను ఆల్రెడీ ఫిక్స్ చేశాడు సూపర్ స్టార్. దర్శకుడు శివకు ఈసారి అవకాశం ఇచ్చాడు. వరుసగా అజిత్ తో సినిమాలు చేస్తూ వస్తున్న ఈ దర్శకుడు, ఈసారి తన స్టోరీలైన్ తో రజనీకాంత్ ను మెప్పించాడు.

నిజానికి దర్బార్ తర్వాత రజనీకాంత్ గ్యాప్ తీసుకుంటారని అంతా అనుకున్నారు. పొలిటికల్ పార్టీ స్థాపిస్తానంటూ చాన్నాళ్లుగా ఊరిస్తున్న రజనీ, పొంగల్ తర్వాత ఆ పనిలో ఉంటారని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ రజనీకాంత్ మాత్రం మరోసారి సినిమాలకే ఫిక్స్ అయ్యారు. శివ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

గతంలో రోబో, పేట సినిమాలు నిర్మించిన సన్ పిక్చర్స్ సంస్థ మరోసారి రజనీకాంత్ తో సినిమా నిర్మించే ఛాన్స్ కొట్టేసింది. రజనీకాంత్ కెరీర్ లో ఇది 168వ సినిమా.