2.0 టీజర్ - సోషల్ మీడియాలో వైబ్రేషన్స్

Thursday,September 13,2018 - 10:36 by Z_CLU

ఇండియాస్ మోస్ట్ అవేటెడ్ మూవీ 2.0 టీజర్ రిలీజయింది. దేశమంతటా జరుగుతున్న వినాయక చవితి సంబరాలు  ఈ టీజర్ తో మరింత స్పెషల్ అనిపించుకుంటున్నాయి. 3000 కు పైగా ప్రపంచ స్థాయి టెక్నీషియన్స్
చేత పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న 2.0 స్టాండర్డ్స్ ని ఎలివేట్ చేస్తుంది ఈ రోజు రిలీజైన  టీజర్.

చేతుల్లోంచి సెల్ ఫోన్స్ మాయమవ్వడం తో బిగిన్ అయ్యే టీజర్ లో మ్యాగ్జిమం టెక్నికల్ ఎలిమెంట్స్ హైలెట్ అయ్యేలా ప్లాన్ చేశారు ఫిలిమ్ మేకర్స్. 1:29 సెకన్ల నిడివి ఉన్న టీజర్ చూస్తున్నంత సేపు ఫాస్ట్ గా స్క్రీన్ పై మూవ్ అవుతున్న గ్రాఫిక్ ఎలిమెంట్స్ జస్ట్ ‘వావ్’ అనిపిస్తున్నాయి. శంకర్ డైరెక్షన్ లో గతంలో రిలీజైన రోబో కి ఇది డెఫ్ఫినేట్ గా మోస్ట్ అప్డేటెడ్ వర్షన్.

సినిమాలో మోస్ట్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే విలన్ రోల్ ప్లే చేస్తున్నాడు అక్షయ్ కుమార్. టీజర్ లో 0: 27 సెకన్ల వద్ద రివీల్ అవుతున్న అక్షయ్ కుమార్ సింప్లీ సూపర్బ్. అయితే సినిమాలో విలన్ స్టాండర్డ్స్ ని
ఎలివేట్ చేసిన 2.0 యూనిట్, విలన్ టార్గెట్  ని  మాత్రం   ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంచింది. ఆ టార్గెట్ ఏంటి..? దాన్ని ‘చిట్టి ద రోబో’ ఎలా ఫేస్ చేసింది అనేదే ఈ సినిమాలోని ప్రధాన కథాంశం గా తెలుస్తుంది. ఈ టీజర్  ని కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్ లో 3D ఫార్మాట్ లో, తక్కిన చోట్ల 2 D ఫార్మాట్ లో రిలీజ్ చేశారు.

నవంబర్ 29 న  ప్రపంచ వ్యాప్తంగా రిలీజవుతుంది 2.0. A.R.రెహమాన్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో  రజినీకాంత్ సరసన ఎమీ జాక్సన్ హీరోయిన్ గా నటించింది.