2 ఫార్మాట్స్ లో రజినీకాంత్ 2.0 టీజర్

Monday,September 10,2018 - 04:14 by Z_CLU

వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 13 న రజినీకాంత్ 2.0 టీజర్ రిలీజవుతుందని రీసెంట్ గా అఫీషియల్ అనౌన్స్ చేశారు ఫిల్మ్  మేకర్స్. 3D ఫార్మాట్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న  ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా భారీ డిమాండ్ క్రియేట్ అయి ఉంది. అయితే ఆ క్రేజ్ ని ఈ టీజర్ తో రెట్టింపు చేసే ప్రాసెస్ లో ఉన్న ఫిల్మ్ మేకర్స్ 2 ఫార్మాట్లలో ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేస్తున్నారు.

ఇండియాతో పాటు కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్ లో ఈ టీజర్ ని 3D లో రిలీజ్ చేయనున్న ఫిలిమ్ మేకర్స్, యూ ట్యూబ్ తో పాటు మరిన్ని థియేటర్స్ లో 2D ఫార్మాట్ లో రిలీజ్ చేయనున్నారు. 3000 కు పైగా ప్రపంచ స్థాయి టెక్నీషియన్స్ పని చేసిన ఈ మ్యాగ్నమ్ ఓపస్, ఫాస్ట్ పేజ్ లో తక్కిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను కంప్లీట్ చేసుకునే ప్రాసెస్ లో ఉంది.

నవంబర్ 29 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమాకి శంకర్ డైరెక్టర్. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ విలన్ గా నటించిన ఈ సినిమాలో ఎమీ జాక్సన్ హీరోయిన్. A.R. రెహమాన్ మ్యూజిక్ కంపోజర్. లైకా ప్రొడక్షన్స బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుంది.