రజినీకాంత్ 2.0 టీజర్ రిలీజ్ డేట్ ఫిక్సయింది

Friday,September 07,2018 - 04:46 by Z_CLU

రజినీకాంత్ మోస్ట్ అవేటెడ్ మూవీ 2.0 టీజర్ రిలీజ్ కి రెడీగా ఉంది. వినాయక చవితి సందర్భంగా ఈ నెల 13 న ఈ సినిమా టీజర్ ని 3D ఫార్మాట్ లో రిలీజ్ చేయనున్నారు ఫిలిమ్ మేకర్స్. నవంబర్ 29 ని రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేసుకున్న ఫిలిమ్ మేకర్స్, ఈ టీజర్ తో సినిమా స్టాండర్డ్స్ ని ఎలివేట్ చేయనున్నారు.

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ విలన్ గా నటించిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్ లో ఉంది. హాలీవుడ్ స్థాయి టెక్నికల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యేలా ఉండబోతుందీ టీజర్.

ఎమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి A.R. రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. లైకా ప్రొడక్షన్ బ్యానర్ పై తెరకెక్కుతున్న 2.0 కి శంకర్ డైరెక్టర్.