రజినీకాంత్ 2.0 టీజర్ రిలీజ్ డేట్

Wednesday,December 06,2017 - 06:14 by Z_CLU

రజినీకాంత్ మోస్ట్ అవేటెడ్ మూవీ 2.0 టీజర్ రిలీజ్ డేట్ ఫిక్సయింది. రీసెంట్ గా ఆడియో రిలీజ్ జరుపుకున్న ఈ మూవీ ఏప్రియల్ లో రిలీజ్ కి రెడీ అవుతుంది. అయితే ఈ లోపు రిపబ్లిక్  డే  సందర్భంగా  జనవరి 26 న ఈ మూవీ టీజర్ ని రిలీజ్ చేసే ప్లాన్ లో ఉంది సినిమా యూనిట్.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ ప్రాసెస్ లో ఉన్న ఈ సినిమా కోసం హాలీవుడ్ స్థాయి టెక్నీషయన్స్ తో గ్రాఫిక్ వర్క్ జరుగుతుంది. తెలుగు, తమిళ, హిందీ భాషలతో పాటు అరబిక్ భాషలోను రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమాపై వరల్డ్ వైడ్ గా భారీ అంచనాలు సెట్ అయి ఉన్నాయి.

A.R. రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ విలన్ రోల్ ప్లే చేశాడు. రజినీకాంత్ సరసన ఎమీ జాక్సన్ హీరోయిన్ గా నటించింది. శంకర్ ఈ సినిమాకి డైరెక్టర్.