క్రిష్ ‘మణికర్ణిక’పై 2.0 సినిమా ఇంపాక్ట్

Wednesday,May 30,2018 - 01:24 by Z_CLU

ఝాన్సీరాణి లక్ష్మీబాయ్ బయోపిక్ గా తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ మణికర్ణిక. క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకునే ప్రాసెస్ లో ఉంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలోనే ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు ఫిల్మ్ మేకర్స్. దానికి రీజన్ రజినీకాంత్ 2.0 సినిమా.

రజినీకాంత్ 2.0 ని సెప్టెంబర్ లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తున్నా, ఫిల్మ్ మేకర్స్ మాత్రం ఇప్పటి వరకు ఈ సినిమా రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. దాంతో మణికర్ణిక టీమ్ డైలమా లో పడింది.

మ్యాగ్జిమం ఆగష్టు లేదా సెప్టెంబర్ లో తమ  సినిమాని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్న ‘మణికర్ణిక’ ఫిల్మ్ మేకర్స్, ఎగ్జాక్ట్ డేట్ ని మాత్రం 2.0 రిలీజ్ డేట్ ఫిక్సయ్యాకే అనౌన్స్ చేస్తారు.

లక్ష్మీబాయ్ లైఫ్ లోని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా  మేకింగ్  విషయంలోనూ ఏ మాత్రం చాన్స్ తీసుకొని మణికర్ణిక టీమ్, ఈ సినిమా రిలీజ్ విషయంలోనూ అంతే ప్లాన్డ్ గా ఉన్నారు. క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాని కమాల్ జైన్ నిర్మిస్తున్నాడు.