తెలుగులో 100 కోట్ల మార్క్ రీచ్ అయిన 2.0

Thursday,December 13,2018 - 06:39 by Z_CLU

వరస వసూళ్లతో దూసుకుపోతుంది రజినీకాంత్ 2.0. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 700 కోట్లు వసూలు చేసిన 2.0, టాలీవుడ్ లో సూపర్ స్ట్రాంగ్ గా రన్ అవుతుంది. క్రేజీ వసూళ్లతో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా 100 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ వీకెండ్ తర్వాత 2.0 క్రేజ్ యూత్ నుండి ఫ్యామిలీస్ కి ట్రాన్స్ ఫామ్ అవ్వడం, 2.0 బాక్సాఫీస్ కి మరింతగా కలిసొస్తుంది. సినిమాలోని నెవర్ సీన్ బిఫోర్ విజువల్స్, సినిమాపై రోజు రోజుకి మరింత  ఇంట్రెస్ట్  ని జెనెరేట్  చేస్తున్నాయి.

శంకర్ డైరెక్షన్ లో ఈ సినిమా మరిన్ని వసూళ్లు రికార్డ్ చేసుకోవడం గ్యారంటీ అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. రజినీకాంత్ ఆన్ స్క్రీన్ గ్రేస్ సినిమాకి పెద్ద ఎసెట్ అయితే, హాలీవుడ్ స్టాండర్డ్స్ టెక్నికల్ ఎలిమెంట్స్ 2.0 ని వరల్డ్ క్లాస్ ఎంటర్ టైనర్ గా నిలబెడుతున్నాయి.