స్పైడర్ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా సూపర్ స్టార్?

Thursday,August 17,2017 - 11:30 by Z_CLU

సెప్టెంబర్ 9న స్పైడర్ సినిమాకు సంబంధించి చెన్నైలో భారీ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఆ ప్రత్యేక కార్యక్రమంలో మహేష్ బాబును కోలీవుడ్ కు పరిచయం చేయబోతున్నారు. మహేష్ తమిళ్ లో నటించిన స్ట్రయిట్ సినిమా కావడంతో స్పైడర్ కు అక్కడ ప్రత్యేకమైన ప్రమోషన్ ప్లాన్ చేశారు. ఈ స్పెషల్ ఈవెంట్ కు సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరయ్యే అవకాశాలున్నాయి.

స్పైడర్ సినిమాను తమిళ్ లో లైకా ప్రొడక్షన్స్ సంస్థ పంపిణీ చేస్తోంది. ఇదే బ్యానర్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా 2.0 సినిమాను తెరకెక్కిస్తోంది. ఆ అనుబంధంతో స్పైడర్ స్పెషల్ ప్రమోషన్ ఈవెంట్ కు రజనీ హాజరయ్యే అవకాశాలున్నాయంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మురుగదాస్ సినిమాగా స్పైడర్ కు తమిళనాట క్రేజ్ ఉంది. రజనీకాంత్ కనుక హాజరైతే తమిళ్ లో స్పైడర్ సినిమాకు మరింత క్రేజ్ వస్తుంది.

మహేష్‍‍‍‍ – రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను దసరా కానుకగా సెప్టెంబర్ 27న విడుదల చేయబోతున్నారు. హరీష్ జైరాజ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన సింగిల్ సూపర్ హిట్ అయింది.