రజిని అప్ కమింగ్ మూవీస్

Saturday,July 22,2017 - 10:00 by Z_CLU

లాస్ట్ ఇయర్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ‘కబాలి’ తో థియేటర్స్ లో సందడి చేసిన సూపర్ స్టార్ రజిని కాంత్ ప్రెజెంట్ ఓ రెండు సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయాడు. గతంలో శంకర్ డైరెక్షన్ లో రెండు సినిమాలు చేసిన రజిని ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో మూడో సినిమాగా 2.0 చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటే యంగ్ డైరెక్టర్ పా.రంజిత్ కి మరో ఛాన్స్ ఇచ్చి ‘కాలా’ సినిమాను కూడా సెట్స్ పై పెట్టేశాడు సూపర్ స్టార్.

రజిని -శంకర్ లది అల్టిమేట్ కాంబినేషన్.. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘శివాజీ’,’రోబో’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి. అందుకే మరో సారి శంకర్ దర్శకత్వంలో రోబో సీక్వెల్ గా 2 .0 సినిమాను చేస్తున్నాడు సూపర్ స్టార్. ఇప్పటికే ఈ సినిమాను ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజి కి తీసుకొచ్చిన రజిని జనవరిలో 2.0 తో థియేటర్స్ లో సందడి చేయబోతున్నాడు.

ఇటీవలే ‘కబాలి’ సినిమాతో రజిని ను మోస్ట్ స్టైలిష్ గా ప్రెజెంట్ చేసి ఎంటర్టైన్ చేసిన పా.రంజిత్ దర్శకత్వంలోనే మరో సినిమా చేస్తున్నాడు రజిని. ‘కాలా’ టైటిల్ తో మాఫియా బాగ్రాప్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న సినిమాను రీసెంట్ గా సెట్స్ పై పెట్టిన సూపర్ స్టార్ వీలైనంత త్వరగా ఈ సినిమాను ఫినిష్ చేయాలని చూస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తవ్వగానే కొన్ని నెలలు గ్యాప్ తీసుకొని నెక్స్ట్ సినిమాను స్టార్ట్ చేస్తాడు సూపర్ స్టార్.