రజనీకాంత్ బర్త్ డే స్పెషల్

Tuesday,December 12,2017 - 11:42 by Z_CLU

శివాజీ నుండి రజినీకాంత్ వరకు ఆయన ప్రయాణం ప్రతి ఒక్కరికి ఇన్స్ పిరేషన్. ఒక సాధారణ కానిస్టేబుల్ కడుపున పుట్టి, కండక్టర్ గానే సెటిల్ అవ్వాల్సిన శివాజీ, ఈ రోజు కోట్ల మంది గుండెల్లో స్టార్ గా ఎదిగాడు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ప్రతి జెనెరేషన్ కి ఫేవరేట్ స్టార్ గా ఎదిగిన రజినీకాంత్ 66 ఏళ్ళ క్రితం సరిగ్గా ఈ రోజే పుట్టాడు.

rajini-_-02

 

 1975 లో బాలచందర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘అపూర్వ రాగంగళ్’ సినిమాతో తెరంగేట్రం చేసిన రజినీకాంత్, ఈ సినిమాలో చేసింది సపోర్టింగ్ క్యారెక్టరే అయినా, డైరెక్టర్ బాలచందర్ దగ్గర ఒక్క సినిమాతోనే 100 మార్కులు సంపాదించుకున్నారు. ఆ మార్కులే ఆయన ఫిలిం కరియర్ కి స్ట్రాంగ్ బేస్ మెంట్ అయింది.

rajini-_-03

మొదటి సినిమా తరవాత మళ్ళీ బాలచందర్ డైరెక్షన్ లో ‘అంతులేని కథ’ సినిమాలో నటించిన రజినీకాంత్ నటుడిగా మంచి గుర్తింపు పొందడంలో సక్సెస్ అయ్యారు.

rajini-_-04

వరసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో స్టైలిష్ స్టార్ గా దూసుకుపోతున్న రజినీకాంత్ కి దేశ వ్యాప్తంగా ప్రశంసలు తెచ్చి పెట్టిన సినిమా ‘దళపతి’. ఈ సినిమా సాధించిన విజయం ఒక్కసారిగా ఆయన వైపు తిరిగి చూసేలా చేసింది.

rajini-_-05

పెదరాయుడు లో గెస్ట్ రోల్ లో నటించిన రజినీకాంత్, ఆయన స్టైలిష్ యాక్షన్ క్యారెక్టర్స్ కి మాత్రమే కాదు, అలాంటి పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లోను గడగడలాడించగలరని ప్రూఫ్ చేశారు.

rajini-_-06

సూపర్ స్టార్ రజినీకాంత్ సక్సెస్ ఫుల్ కరియర్ లో ‘బాషా’ సినిమాది ప్రత్యేక స్థానం. ఇండియన్ సినిమా హిస్టరీ లో వైబ్రేషన్స్ క్రియేట్ ఈ సినిమా, రజినీకాంత్ కి ఇంటర్నేషనల్ స్టార్ గా గుర్తింపు సాధించిపెట్టింది.

rajini-_-07

రజినీకాంత్ సినిమాలంటేనే ఎక్స్ పెరిమెంట్స్. కథలో దమ్ముండాలి కానీ, ఎంత రిస్క్ చేయడానికైనా సై అనే సూపర్ స్టార్,  ‘నరసింహ’ సినిమాలో స్టైలిష్ ఓల్డ్ మ్యాన్ గా కనిపించి సెన్సేషన్ క్రియేట్ చేశారు.

rajini-_-08

రజినీకాంత్ సినిమాలంటేనే హై ఎండ్ బిజినెస్ ప్లాట్ ఫాం. చెక్కు చెదరని స్టార్ డం ని క్రియేట్ చేసుకున్న రజినీకాంత్ ‘శివాజీ’ సినిమాకి అక్షరాలా 26 కోట్ల హైయెస్ట్ రెమ్యూనరేషన్ ని తీసుకుని రికార్డు సృష్టించారు.

rajini-_-09

ఇండియన్ సినిమాల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన అతి తక్కువ సినిమాల్లో ‘రోబో’ సినిమాది ప్రత్యేక స్థానం. శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా, రజినీకాంత్ కరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

rajini-_-10

ప్రస్తుతం  పోస్ట్  ప్రొడక్షన్  స్టేజ్  లో ఉన్న 2.0 తో పాటు,  ప. రంజిత్  డైరెక్షన్  లో తెరకెక్కుతున్న  ‘కాలా’  సినిమాతో బిజీగా ఉన్న రజినీకాంత్, తన 67 వ ఏట కూడా అదే ఎనర్జీతో, సినిమా పట్ల అంతే ప్రేమతో పని చేయడం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది.

     రజినీకాంత్ అంటేనే స్టైల్, ఇన్స్ పిరేషన్. అందుకే ఆయన ఇలాంటి బర్త్ డే లు ఇంకా ఎన్నెన్నో జరుపుకోవాలని, మంచి సినిమాలతో ఆయన అభిమానులను అలరిస్తూ ఉండాలని కోరుకుంటుంది జీ సినిమాలు  .