31 ఏళ్లుగా ‘అహ నా పెళ్ళంట!’

Tuesday,November 27,2018 - 02:44 by Z_CLU

సరైన కంటెంట్ తో కామెడీ ఎంటర్ టైనర్ రావాలే కానీ అది సంవత్సరాల తరబడి క్రేజ్ రీక్రియేట్ చేసుకుంటూనే ఉంటుంది. అలాంటి సినిమాల వరసలో టాప్ లిస్టులో ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ ‘అహ నా పెళ్ళంట.’ ఈ సినిమా రిలీజై ఇవాళ్టికి సరిగ్గా 31 ఏళ్ళు.

జంధ్యాల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా కొత్తగానే ఉంటుంది. ఆర్టిస్టుల టైమింగ్, డైలాగ్స్, సినిమాలో న్యాచురల్ గా క్రియేట్ అయ్యే సిచ్యువేషన్స్… ఈ వరసలో దేనికి ఎక్కువ మార్కులు పడతాయో చెప్పలేం కానీ, 31 ఏళ్ల క్రితం జంధ్యాల క్రియేట్ చేసిన ఈ లాఫ్టర్ మ్యాజిక్, ఇప్పటికీ అలరిస్తూనే ఉంది. కామెడీ కింగ్ బ్రహ్మానందం ఈ సినిమాతోనే  టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ అయ్యాడు.

నిజానికి ఈ సినిమా కన్నా ముందు జంధ్యాల నుండి వేరే సినిమా రావాలి. కానీ ఆ కథ విన్న రామానాయుడు గారు అంతగా ఇంప్రెస్ కాకపోవడంతో, కేవలం ఒక్క రాత్రిలో ఈ కథను రెడీ చేసుకుని వెళ్ళారట జంధ్యాల. నాయుడు గారు ఈ కథను  విన్నారో లేదో, ఇమ్మీడియట్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట.

ప్రేమించిన అమ్మాయి తండ్రిని ఇంప్రెస్ చేయడం అనే రెగ్యులర్ స్టోరీలైన్ కి, హై వోల్టేజ్ కామెడీ ఎలిమెంట్స్ ని జత చేయడం కేవలం జంధ్యాలకే చెల్లింది. అందుకే ఇప్పటికీ జస్ట్ ఈ సినిమా టైటిల్   వినిపించినా, వరసగా ఒక్కో సన్నివేశం  కళ్ళ ముందు కదులుతుంది. అంతగా తెలుగు ప్రేక్షకుల ఫేవరేట్ క్లాసిక్ అనిపించుకుంది అహ నా పెళ్ళంట!