రాజశేఖర్ కొత్త సినిమా ‘కల్కి’ ఫస్ట్ అవతార్

Tuesday,January 01,2019 - 05:12 by Z_CLU

రాజశేఖర్ కొత్త సినిమా ‘కల్కి’ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. డిఫెరెంట్ టైటిల్ తో ఆడియెన్స్ లో క్యూరియాసిటీ రేజ్ చేసిన మేకర్స్, ఈ ఫస్ట్ లుక్ తో అదే స్థాయిలో ఈ సినిమాపై ఇంట్రెస్ట్ ని జెనెరేట్ చేస్తున్నారు. 1983 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ లుక్స్ లో ఎట్రాక్టివ్ గా కనిపిస్తున్నాడు రాజశేఖర్.

ఫిల్మ్ మేకర్స్ ఇప్పటి వరకు ఈ సినిమా స్టోరీలైన్ లాంటివి రివీల్ చేయలేదు కానీ, సినిమాలో సస్పెన్స్ తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మేజర్ హైలెట్స్ గా నిలుస్తాయనిపిస్తుంది. దానికి తోడు ఈ సినిమాలో రాజశేఖర్ రిస్కీ స్టంట్స్ చేస్తున్నాడనే ఇన్ఫర్మేషన్, సినిమాపై మరిన్ని అంచనాలను పెంచుతుంది.

ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ డైరెక్టర్. నందిత శ్వేత, అదా శర్మ తో పాటు స్కార్లెట్ విల్సన్ ఈ సినిమాలో హీరోయిన్స్. శివానీ శివాత్మిక మూవీస్ బ్యాన‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో హ్య‌పీ మూవీస్ ప‌తాకంపై రూపొంద‌నున్న ఈ చిత్రానికి సి.క‌ల్యాణ్‌, శివానీ రాజ‌శేఖ‌ర్‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్ నిర్మాత‌లు.