బాలయ్య స్పాట్ లో రాజశేఖర్ హంగామా..

Wednesday,October 19,2016 - 08:30 by Z_CLU

 నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ప్రతిష్టాత్మక వందో చిత్రం… గౌతమీపుత్ర శాతకర్ణి మొట్టమొదటి షెడ్యూల్ ఎక్కడ ప్రారంభం అయిందో గుర్తుందా…? యుద్ధ సన్నివేశాల కోసం ఈ సినిమా తొలి షెడ్యూల్ ను జార్జియాలో షూట్ చేశారు. సినిమాకు ఆ సన్నివేశాలు హైలెట్ గా కూడా నిలవబోతున్నాయి. ఇప్పుడు అదే స్పాట్ లో రాజిశేఖర్ కూడా హల్ చల్ చేయబోతున్నాడు.

maxresdefault-1

    తనకు బాగా కలిసొచ్చిన పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో సీనియర్ హీరో రాజశేఖర్ మరోసారి అలరించడానికి రెడీ అవుతున్నాడు. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం తాజాగా హైదరాబాద్ లో చిత్రీకరణ పూర్తి చేసుకొని ప్రస్తుతం జార్జియాలో షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇదే స్పాట్ లో మొన్నటి వరకూ నందమూరి బాలకృష్ణ ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ సినిమా షూటింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే స్పాట్ లో పోలీస్ పాత్ర తో సందడి చేయబోతున్నాడట రాజశేఖర్. ప్రస్తుతం జార్జియాలో కొన్ని కీలక సన్నివేశాల తో పాటు పాటలు కూడా చిత్రీకరిస్తారట. ఈ షెడ్యూల్ తో సినిమా టాకీ పూర్తవుతుందని సమాచారం..