మళ్లీ పోలీస్ గా రాజశేఖర్.. కల్కి టీజర్ రివ్యూ

Wednesday,April 10,2019 - 11:55 by Z_CLU

గరుడవేగ తర్వాత రాజశేఖర్ చేస్తున్న సినిమా కల్కి. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ చాలా కొత్తగా ఉంది.

1980 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది కల్కి సినిమా. యాక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాలో మరోసారి పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించబోతున్నాడు రాజశేఖర్. టీజర్ లో ప్రతి ఫ్రేమ్ కొత్తగా ఉంది. సినిమాకు సంబంధించిన కీలకమైన పాత్రలన్నింటినీ టీజర్ లో పరిచయం చేశారు. శ్రవణ్ భరధ్వాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.

అదా శర్మ, నందిత శ్వేత, పూజిత పొన్నాడ ఇందులో హీరోయిన్లుగా నటించారు. వీళ్లలో అదా శర్మ క్యారెక్టర్ ను మాత్రమే టీజర్ లో పరిచయం చేశారు. సి.కల్యాణ్ నిర్మించిన ఈ సినిమా సమ్మర్ ఎట్రాక్షన్ గా త్వరలోనే థియేటర్లలోకి రాబోతోంది.