అప్పటి 'అర్జున' ఇప్పుడొస్తున్నాడు

Thursday,March 07,2019 - 03:17 by Z_CLU

‘PSV గరుడవేగ’ తర్వాత కొన్ని నెలలు గ్యాప్ తీసుకున్న సీనియర్ హీరో రాజశేఖర్ ప్రస్తుతం ‘కల్కి’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. సినిమా లవర్స్ అందరూ కల్కి కోసం వెయిట్ చేస్తున్న సందర్భంలో ‘అర్జున’ అంటూ మరో సినిమాను రిలీజ్ కి రెడీ చేసాడు రాజశేఖర్. ఇంతకీ ఈ ‘అర్జున’ సినిమా ఎప్పుడు షూట్ చేసారు..? .. ఇది రాజేశేఖర్ లేటెస్ట్ సినిమానేనా..? ఈ ప్రశ్నలే ఇప్పుడందరికీ  స్ట్రైక్ అవుతున్నాయి.

అయితే ఇది రాజశేఖర్ నుండి వస్తున్న లేటెస్ట్ సినిమా కాదు. లేట్ సినిమా. అప్పట్లో షూటింగ్ ఫినిష్ చేసుకొని రిలీజ్ వరకూ వచ్చి ఆగి పోయిన ఈ సినిమాను సి.కళ్యాన్ ప్రెజెంట్స్ తో ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. కల్కి షూటింగ్ డిస్కర్షన్స్ లో ఈ సినిమా గురించి తెలుసుకున్న నిర్మాత కళ్యాణ్ ఈ సినిమాను చూసి తెలుగులో రిలీజ్ చేస్తున్నాడు.

ప్రస్తుతం తెలుగులో పెద్దగా రిలీజ్ లేవి లేకపోవడంతో వచ్చే వారం ఈ పొలిటికల్ డ్రామా సినిమాను థియేటర్స్ లోకి తీసుకొస్తున్నారు. మరి ఈ లేట్ సినిమాతో రాజశేఖర్ హిట్ కొడతాడా..లేదా..చూడాలి.